మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన దారుణ హత్య కేసులో మల్కాజిగిరి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైల్వే ఉద్యోగి మారుతి సుతార్‌ను పింఛన్ ప్రయోజనాల కోసం అతని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కొడుకు కిషన్ సుతార్ అలియాస్ రాహుల్, భార్య గంగాబాయి, కూతురు ప్రపుల్ల అలియాస్ పప్పి నిందితులుగా ఉన్నారు. నిందితులు మారుతి సుతార్‌కు రెండు రోజుల పాటు ఆహారంలో ఉమ్మెత్త (డాటూరా) విషాన్ని కలిపి ఇచ్చారు
విష ప్రభావంతో ఆయన మృతి చెందగా, అనంతరం ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి బకెట్లలో పెట్టి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి, సాక్ష్యాధారాలు సేకరించారు. వాటిని పరిశీలించిన కోర్టు కిషన్ సుతార్, ప్రపుల్లకు ఉరిశిక్ష విధించగా, గంగాబాయికి జీవిత ఖైదు విధించింది.
